హైదరాబాద్, ఆగస్టు 23: హైదరాబాద్‌కు సమీపంలోని జడ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మార్కెట్లలో అధిక నాణ్యత కలిగిన టైల్స్‌ను అంటుపెట్టే ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ సరికొత్త ప్లాంట్‌ను తెరిచినట్లు కంపెనీ ఎండీ భరత్ పూరి తెలిపారు. ప్రీమియం, ప్రత్యేక ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నదన్నారు. ఈ యూనిట్లో 80 శాతం సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఈ ప్లాంట్‌లోనే వినియోగిస్తున్నట్లు చెప్పారు.