5000 Note | ఆర్బీఐ కొత్తగా రూ.5 వేల నోట్లను తీసుకురాబోతుందా.. కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది.
కొత్తగా రూ.5వేల నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం సోమవారం సాయంత్రం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పష్టం చేసింది. ఆర్థిక అంశాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం https://rbi.org.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది. నకిలీ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది.
ఏమైనా అనుమానాస్పద సమాచారం సర్క్యులేట్ అయితే సంబంధిత లింక్ లేదా ఫొటోను పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వాట్సాప్ నంబర్ +91 8799711259కు లేదా పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ద్వారా పంపించాలని సూచించింది.
⚠️ सतर्क रहें ⚠️
सोशल मीडिया पर दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक द्वारा ₹5000 के नए नोट जारी किए जाएंगे#PIBFactCheck
✅ यह दावा #फर्जी है
✅@RBI द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है
✅ आधिकारिक वित्तीय जानकारी हेतु वेबसाइट https://t.co/e6gEcOvLu3 पर विजिट करें pic.twitter.com/EF82vaxMvE
— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2025