Phonepe | ఆధార్ కార్డుతోనూ యూపీఐ ట్రాన్సాక్షన్స్.. ఫోన్‌పే ఫస్ట్!
Phonepe | ఇక నుంచి డెబిట్ కార్డు లేకున్నా, ఆధార్ కార్డుతో యూపీఐ సేవలను వినియోగించుకునే ఫెసిలిటీ ఫోన్‌పే తీసుకొచ్చింది.
Phonepe | ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ `ఫోన్‌పే` తన ఖాతాదారులకు నూతన ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌తో ఈ ప్లాట్‌ఫామ్‌పై యూపీఐ సర్వీస్ పొందొచ్చు. యూపీఐ సెటప్ కోసం ఖాతాదారులు ఇంతకు ముందు డెబిట్ కార్డు డిటైల్స్ తెలియజేయాల్సి ఉండేది. ఆ తరవాతే యూపీఐ పిన్ జనరేట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. డెబిట్ కార్డ్ తప్పనిసరి కావడంతో అది లేని వారు ఇప్పటికీ యూపీఐ సేవలను పొందలేకపోతున్నారు.
ఆధార్ బేస్డ్ యూపీఐ ఆన్‌బోర్డింగ్ సేవలందిస్తున్న తొలి యూపీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా ఫోన్‌పే నిలవనున్నదని ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల మరింత మందికి డిజిటల్ పేమెంట్స్‌తో లబ్ధి చేకూరనున్నది. మీరు కొత్త యూజర్ అయితే, ఆధార్ నంబర్ ద్వారా ఫోన్‌పేపై మీ యూపీఐ సేవలు సెట్అప్ చేసుకోవచ్చు.
2016లో యూపీఐ సేవలు ప్రారంభించడంతో డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యూపీఐ రాకతో బ్యాంక్ ఖాతాకు నేరుగా మనీ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు డిజిటల్ వాలెట్ ట్రెండ్ ఉండేది. వాలెట్లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ యూపీఐ సేవల కోసం కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేదు.
ఆర్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకులు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ సేవలు అందిస్తున్నాయి. ఈ రెండు సేవల ద్వారా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో ఐఎంపీఎస్, రూపే, యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ లావాదేవీలకు జీరో చార్జి ఫ్రేమ్‌వర్క్ కేంద్రం అమల్లోకి తెచ్చింది.
యూపీఐ సిస్టమ్‌లో రియల్‌టైంలో నిధులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకే అప్లికేషన్‌తో పలు బ్యాంకు అకౌంట్లు లింక్ చేయొచ్చు. ఎవరికైనా మనీ పంపాలంటే.. వారి మొబైల్ ఫోన్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఉండాలి. ఐఎంపీఎస్ మోడల్ ఆధారంగా యూపీఐ సేవలు అభివృద్ధి చేశారు. యూపీఐ యాప్ ద్వారా 24×7 బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో యూపీఐ సేవలను వాడుకోవడానికి ఓటీపీ, సీవీవీ కోడ్, కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్ వంటి అంశాల నమోదు అవసరం లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

