బెంగళూరు, ఆగస్టు 25 : ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఫోన్‌పే సరికొత్త బీమా ప్రాడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వాహనాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న సంస్థ.. తాజాగా ఇంటికి కూడా బీమా ఆఫర్ చేస్తున్నది. రూ.181 ప్రారంభంతో ఈ ప్రత్యేక పాలసీని విక్రయిస్తున్నది. అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు, దొంగతనం వంటి 20 రకాల రిస్క్‌లకు ఈ బీమా వర్తించనున్నదని పేర్కొంది. ఈ పాలసీ తీసుకున్నవారు రూ.10 లక్షల నుంచి రూ.12.5 కోట్ల లోపు కవరేజ్ లభించనున్నదని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈవో విశాల్ గుప్తా తెలిపారు.