PhonePe | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే తన యూజర్ల కోసం అకౌంట్ అగ్రిగేటర్ సర్వీసులు ప్రారంభించింది. ఫోన్ పే అనుబంధ ఫోన్ పే టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (పీటీఎస్పీఎల్) సారధ్యంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్థిక సంస్థలు, వినియోగదారులు తమ ఫైనాన్సియల్ డేటా తేలిగ్గా షేర్ చేసుకునే వెసులుబాటులో కోసం ఈ సేవలను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 2021లో ఆర్బీఐ నుంచి ఫోన్ పే అకౌంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందింది.
యూజర్లు ఈ సేవల సాయంతో తమ ఆర్థిక లావాదేవీల వివరాలు.. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇతర ఫైనాన్సియల్ సేవల సంస్థలతో షేర్ చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం.. తమ యూజర్లు త్వరిగతిన ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్, సేవలు పొందొచ్చునని ఫోన్ పే వెల్లడించింది.
అకౌంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందడం వల్ల కొత్తరుణాలు తీసుకోవడంతోపాటు బీమా పాలసీల కొనుగోలు, పెట్టుబడుల సలహాలు పొందడానికి ఫైనాన్సియల్సర్వీసెస్ సంస్థలు కస్టమర్లకు చేయతనిస్తాయి. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా 100కిపైగా ఆర్థిక సంస్థలతో ఫోన్ పే జత కట్టింది.
యూజర్లు ముందుగా తమ ఫోన్ పే యాప్లో అకౌంట్ అగ్రిగేటర్ ఖాతా క్రియేట్ చేయాలి. అటుపై తమ బ్యాంక్ ఖాతాలన్నీ అనుసంధానించాలి. అన్ని అకౌంట్లు అనుసంధానించిన తర్వాత యూజర్లు తమ ఫైనాన్సియల్ డేటాను ఇతర ఆర్థిక సంస్థలతో షేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ పర్మిషన్ను యూజర్లు తమకు ఇష్టం లేనప్పుడు తాత్కాలికంగా లేదా పూర్తిగా నిలిపేయవచ్చని ఫోన్ పే కో ఫౌండర్ సీటీ రాహుల్ చారి చెప్పారు.