హైదరాబాద్, జూన్ 20: వచ్చే నెల 5 నుంచి 7 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఫార్మా ఎగ్జిబిషన్‌ను నిర్వహించబోతున్నట్టు ఫార్మాక్సిల్ ప్రకటించింది. 9వసారి జరుగుతున్న ఈ ఎక్స్‌పోలో 375 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ సదస్సుకు విదేశాలకు చెందిన డెలిగేట్స్, మంత్రులు తదితరులు హాజరుకాబోతున్నారు.