హైదరాబాద్, నవంబర్ 6: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దివీస్ ల్యాబ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 29.50 శాతం తగ్గి రూ.348 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే సమయంలో సంస్థ రూ.493.60 కోట్ల లాభాన్ని గడించింది. గతేడాది కరోనా ఔషధానికి డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే లాభాలు భారీగా పెరిగాయని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం మూడు శాతం పెరిగి రూ.1,855 కోట్ల నుంచి రూ.1,909 కోట్లకు పెరిగాయి.