Personal Finance | మిడిల్ క్లాస్ వాళ్లు రిచ్ ఎప్పుడు అయినట్లు? మధ్యతరగతి ప్రజలు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!
Personal Finance | ఉద్యోగం చేయకపోయినా.. ఐదేండ్లపాటు కుటుంబాన్ని పోషించగలిగే స్థితికి చేరుకున్నారంటే మీరు ఓ మోస్తరు ధనవంతులు అయినట్టే. అంటే, నగదు కూడబెట్టడంతోపాటు స్థిరచరాస్తుల ద్వారా ఎంతోకొంత రాబడి సమకూర్చుకోవడం అన్నమాట! ఇలాంటి రాబడి లక్షల్లో ఉన్నవాళ్లు శ్రీమంతులు.
Personal Finance | ప్రతి నెలా ఒకటో తారీఖు గడికోసారి ఫోన్ వంక చూసేవాళ్లే మధ్యతరగతి మానవులు. వేతన సందేశం ఎప్పుడొస్తుందా అని నలిగిపోవడం వీళ్లకు మామూలే! ఒకటో తేదీన ఉబుసుపోక కన్న కలలన్నీ.. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లేసరికే నీరుగారిపోతాయి! పదో తేదీ వచ్చేసరికి చేబదుళ్లు, ఇరవయ్యో తేదీ వచ్చేనాటికి క్రెడిట్ కార్డు స్వైపింగ్లు, నెలాఖరున చేతిలో చిల్లిగవ్వ లేక ‘ఈ మధ్యతరగతి బతుకులింతే!’ అని ఇదై పోవడాలు రొటీన్! మిడిల్‌క్లాస్ పరీక్షలు తట్టుకొని నిలబడితే గానీ, అప్పర్ మిడిల్ క్లాస్‌లోకి ఎంట్రీ దొరకదు. అక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండగలిగితే రిచ్ క్లాస్‌లో ఎంట్రీ దొరుకుతుంది.
‘మావి మధ్యతరగతి జీవితాలు బాబు! రాస్తే రామాయణమంత.. వింటే భారతమంత!’ అంటూ కడుపేదవాడి కన్నా దీనంగా మహానటులు చెప్పిన డైలాగులు ఎన్నో సినిమాల్లో చూశాం, విన్నాం! ఇంతకీ ఎవరీ మిడిల్‌క్లాస్? వీరిలో బోలెడన్ని రకాలు! లేని ధనాన్ని ముందుగానే ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించే వాళ్లు ఒకరకం. రాబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ చేతిలో ఉన్నదంతా ఊడ్చి పెట్టుకునేవాళ్లు రెండో రకం. రాబడికి మించి పెరుగుతున్న ఖర్చులను అదుపు చేయలేనివాళ్లు మూడో రకం. ఎల్లకాలం పొదుపు మంత్రాన్ని పఠిస్తూ.. ఆశలను అదుపుచేసుకుంటూ భారంగా బతుకీడ్చేవాళ్లు మరో రకం. ఈ రకరకాల మనస్తత్వాల కలగాపులగమే మిడిల్‌క్లాస్ ప్రపంచం.
హెచ్చులకు పోయి..
ఓ పాతికేండ్లు వెనక్కి వెళ్తే… మధ్యతరగతి బతుకులు నిబ్బరంగా సాగేవి. ఉన్నంతలో ఫర్వాలేదు అనేలా ఉండేవి! కానీ, ఇప్పటి మిడిల్‌క్లాస్ నిర్వచనం ఇంటికో తీరుగా తయారైంది. నెలకు లక్షన్నర జీతం ఉన్నవ్యక్తిని కూడా మధ్యతరగతి కింద జమకట్టేస్తున్నారు. ఆదాయాన్ని బట్టి స్థాయి పెరగదు. ఆస్తులు, ఆదాయం, కుటుంబసభ్యులు, భవిష్యత్ అవసరాలు, బాధ్యతలను అన్నిటినీ బేరీజు వేసుకొని అంచనాకు రావాలి. అయితే, చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు సంపన్నులుగా కనిపించాలని భావిస్తుంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా.. లేని హెచ్చులకు పోయి జీవితాన్ని అగమ్యగోచరంగా చేసుకుంటారు. పైగా, ఈఎమ్ఐ సంసృతి ప్రబలడంతో ఇల్లు, కారు, గృహోపకరణాలు అన్నీ రుణం ద్వారా సమకూర్చుకొని నెలవారీ వాయిదాలు కడుతూ ఏండ్లకు ఏండ్లు గడిపేస్తున్నారు. లోను ద్వారా తీసుకున్నవాటిని కూడా ఓన్‌గా భావిస్తూ శ్రీమంతులుగా భ్రమపడుతుంటారు. తీరా రుణవిముక్తులు అయ్యేనాటికి మిడిల్ క్లాస్‌గానే మిగిలిపోతారు.
ఎప్పుడు రిచ్ అంటే..
నెలవారీ ఆదాయం ఖర్చులకు సమానంగా ఉంటే మధ్య తరగతి. ఖర్చులకు మించి రెట్టింపు ఆదాయం ఉన్నట్లయితే ఎగువ మధ్య తరగతిగా భావించొచ్చు. ఆదాయం స్థిరంగా ఉండదు. ద్రవ్యోల్బణం శాతానికి మించి ఆదాయం పెరగడం లేదంటే.. మిడిల్ క్లాస్ నుంచి పేదవారి జాబితాలోకి చేరుతున్నట్టే అని భావించాలి. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ధరలూ మండుతాయి. ఖర్చులు అధికమవుతాయి. రాబడిలో మారకుండా ఖర్చులు తడిసి మోపెడైతే.. ఆర్థికంగా ఎదగడం అసాధ్యం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. చెప్పినంత తేలిక కాదు. ఆదాయంలో మిగులుబాటు సాధిస్తే.. ఆర్థిక నిల్వలు నిదానంగా పెరుగుతాయి. ఉద్యోగం చేయకపోయినా.. ఐదేండ్లపాటు కుటుంబాన్ని పోషించగలిగే స్థితికి చేరుకున్నారంటే మీరు ఓ మోస్తరు ధనవంతులు అయినట్టే. అంటే, నగదు కూడబెట్టడంతోపాటు స్థిరచరాస్తుల ద్వారా ఎంతోకొంత రాబడి సమకూర్చుకోవడం అన్నమాట! ఇలాంటి రాబడి లక్షల్లో ఉన్నవాళ్లు శ్రీమంతులు.
ఆదాయం పెరిగినా మిడిల్‌క్లాస్ మెంటాలిటీ ఊరుకోదు! దాన్ని మరోచోట ఇన్వెస్ట్ చేయమంటుంది. అక్కడినుంచీ లాభాలు పొందేలా చూస్తుంది. ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా పాటించకున్నా, ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప ధనవంతులు మిడిల్‌క్లాస్‌కు పడిపోరు. కానీ, ఆర్థిక క్రమశిక్షణ, దూరదృష్టి ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఎప్పటికైనా సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటాయి.తేడా.. దవాఖాన ఖర్చంత మధ్యతరగతి ర్యాంకును మెరుగుపర్చుకోవాలంటే చాలా ఏండ్లు కష్టపడాలి. కానీ, చిన్న తప్పు చేసినా దిగువ మధ్యతరగతికి జారిపోవడం ఖాయం. మధ్యతరగతికి, నిరుపేదకూ మధ్య తేడా ఆస్పత్రి ఖర్చంత! ఇంట్లో ఏ ఒక్కరికైనా ఊహించని అనారోగ్య సమస్య తలెత్తితే.. అన్ని రోజులూ కడుపు కట్టుకొని కూడబెట్టిందంతా కర్పూరంలా కరిగిపోవచ్చు. ఆరోగ్య బీమా లేకుండా జీవితాన్ని వెళ్లదీసుకోవచ్చు అనుకుంటే పొరపాటు. ఆరోగ్య బీమాతో మీరు రిచ్ కాకపోవచ్చేమో కానీ, నిరుపేదలు కాకుండా ఉండగలుగుతారు. దీంతోపాటు జీవిత బీమా కూడా తోడుంటే.. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని దూరమైనా.. ఆ కుటుంబ పరిస్థితిలో మార్పు ఉండదు. పిల్లల చదువులు ఆగవు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదు!
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Home Loan | హోంలోన్ భారం కావద్దని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

