Personal Finance Tips | ఫిక్స్డ్ డిపాజిట్లపై లోన్లు తీసుకుంటే లాభమా? నష్టమా?
Personal Finance Tips | ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం వ్యక్తిగత రుణాలపై వడ్డీ 14 శాతంపైనే ఉంటున్నది. సిబిల్ స్కోర్ అంతంతమాత్రంగా ఉంటే వడ్డీరేటు మరింతగా చెల్లించాల్సిందే. ఇక క్రెడిట్ కార్డుల సంగతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
Personal Finance Tips | ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం వ్యక్తిగత రుణాలపై వడ్డీ 14 శాతంపైనే ఉంటున్నది. సిబిల్ స్కోర్ అంతంతమాత్రంగా ఉంటే వడ్డీరేటు మరింతగా చెల్లించాల్సిందే. ఇక క్రెడిట్ కార్డుల సంగతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే గత్యంతరం లేదు అన్నప్పుడే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కన్వర్షన్, పర్సనల్ లోన్లవైపు వెళ్లాలి. అంతేగాక 3-6 నెలల అవసరాలకు మాత్రమే వీటిని వినియోగించుకోవడం ఉత్తమం.
ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయా..?
పెట్టుబడి మార్గాలు ఏవైనా ఉన్నాయా?.. అని ఆలోచించిన తక్షణం మనలో అత్యధికులకు మొదటగా గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్లే. ఎందుకంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు భద్రంగా ఉంటుందన్న ధైర్యంతోపాటు అవసరమొచ్చిన ప్రతిసారీ దీని జోలికి వెళ్లకుండా ఉంటామనే నమ్మకం కూడా. నిజానికి ఎఫ్డీ.. అప్పటికీ, ఇప్పటికీ ఓ మంచి మార్గమే. రిస్క్ ఏమాత్రం వద్దు.. తక్కువ వడ్డీ వచ్చినా పర్వాలేదు అనుకునేవాళ్లు మనం ఎన్ని చెప్పినా మొదటి ఓటును ఎఫ్డీలకే వేస్తారు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు 7 నుంచి 9 శాతం వరకు ఎఫ్డీలపై వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. గత ఏడాది కాలంగా ఎఫ్డీలపై వడ్డీ బాగానే వర్కవుటవుతున్నది.
ఎందుకు లాభమంటే..
ఫిక్స్డ్ డిపాజిట్లలో, బ్యాంకుల్లో నగదు ఉంటే ఇక అప్పు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అని అనుకోవచ్చు. అయితే ఎఫ్డీ అనేది ఓ ఎమోషనల్ అటాచ్మెంట్. భవిష్యత్తులో ఎప్పుడో రాబోయే అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే పొదుపు. పిల్లల పెండ్లి, పైచదువులు, ఇల్లు కొనుక్కోవడం, రిటైర్మెంట్.. ఇలా ఎన్నో ఆశలు దానితో ముడిపడి ఉంటాయి. అందుకే దాన్ని తాకడానికి మనం పెద్దగా ఇష్టపడం. అలా అని ఇప్పటి అవసరాలు కూడా ఆగవు. బ్యాంకుల్లో డబ్బు ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా ఇప్పుడు అధిక రేట్లు పెట్టి లోన్లు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారిత రుణాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్నది.
వడ్డీ లెక్క ఇదీ..
మనకు ఏదైనా బ్యాంకులో ఎఫ్డీ ఉంటే.. దాన్ని పూచీకత్తుగా పెట్టుకుని లోన్లు పొందే పద్ధతి ఉన్నది. ఉదాహరణకు లక్ష రూపాయల బాండ్ ఏదైనా ఉంటే.. దాన్ని తనఖా కింద పెట్టుకుని రూ.50,000-75,000దాకా రుణం పొందవచ్చు. బయటి మార్కెట్లో మనం పర్సనల్ లోన్ పొందాలంటే కనీసం 12 శాతం, గరిష్ఠంగా 18 శాతం వరకూ ఇంట్రెస్ట్ కట్టాలి. కానీ ఇక్కడమాత్రం అలా కాదు. మనం ఏ వడ్డీకైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశామో.. దానిపై 0.5 శాతం నుంచి 2 శాతం వరకూ అధికంగా మాత్రమే వడ్డీని వసూలు చేస్తారు.
ఉదాహరణకు మీ బాండ్ ద్వారా 7.50 శాతం వడ్డీ వస్తోందని అనుకుందాం. ఇప్పుడు దానిపై ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతిలో రుణాన్ని పొందాలి అనుకుంటే.. బ్యాంకులు 8 నుంచి 9.5 శాతంలోపు వడ్డీకే అప్పులిస్తాయి. ఇక అప్పు తీర్చే సమయంపై కూడా ఎలాంటి ఆంక్షలు పెద్దగా ఉండవు. కానీ మీ బాండ్ మెచ్యూరిటీపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా మనకు ఏదైనా ఆర్థిక అవసరమొస్తే తక్షణం క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్లపై ఆధారపడుతాం. వడ్డీ, కాలపరిమితి ఎంతన్నదీ పెద్దగా పట్టించుకోం. ఒక్కోసారి రూ.100కి 3-4 రూపాయల వడ్డీని కూడా నెలనెలా చెల్లిస్తుంటాం.
అయితే ఇలాంటి సమయాల్లోనే డిఫాల్ట్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ. ఇదే జరిగితే సిబిల్ స్కోర్ భారీగా పడిపోతుంది. మన ఆర్థిక స్థోమతపై లేనిపోని అనుమానాలూ బ్యాంకర్లలో నెలకొంటాయి.
అందుకే వీటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూసుకోవడం ఉత్తమం. అవే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై రుణాలు. తక్కువ వడ్డీకి తాత్కాలిక అవసరాలకు లోన్లు తీసుకోవచ్చు.
ఇవి గుర్తుంచుకోండి
- మీరు ఎఫ్డీపై తీసుకున్న రుణం పూర్తయ్యేదాకా మీ బాండ్ మొత్తం మీ చేతికి రాదు. ఎందుకంటే దాన్ని తనఖా కింద పెట్టుకునే మీకు ఓవర్ డ్రాఫ్ట్, డిమాండ్ లోన్, క్రెడిట్ లోన్ ఇస్తాయి బ్యాంకులు.
- ఇక తప్పదు అనే అవసరం వచ్చినప్పుడు మాత్రమే రుణాలకు వెళ్లడం మంచిది. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే వీలుంది.
- ప్రతీ ఆర్థిక అవసరమూ మనకు పీకల మీదికి వచ్చినట్టే కనిపిస్తుంది. అలాగని నిధులను కరిగిస్తూపోతే, ఎంత మొత్తమూ సరిపోదు.
- ఎఫ్డీలపై పొందే రుణాలకు సాధారణంగా తక్కువ ప్రాసెసింగ్ ఫీజు లేదా జీరో ఫీజు ఉంటుంది. ఇది ప్రక్రియ వేగంగా కూడా పూర్తవుతుంది.
- కొన్ని బ్యాంకులు ఎఫ్డీలపై క్రెడిట్ కార్డులను ఇస్తాయి. అంటే మనం రూ.5 లక్షలకు ఎఫ్డీ చేస్తే అంతే మొత్తం లిమిట్‌తో కార్డ్ వస్తుంది. మన అవసరాలకు డబ్బును వాడుకుంటూ, మళ్లీ తిరిగి కడుతూ ఉండాలి.
- రుణాలు పొందాలి అనుకున్నప్పుడు.. ఏవి స్వల్పకాలికమో, మరేవి దీర్ఘకాలం ఉండేవో ఆలోచించుకోండి. ఎప్పుడైనా దీర్ఘకాలంపాటు చెల్లించే రుణాలు మనకు ఆస్తులను (ఇల్లు, కారు, ఏదైనా ఆస్తి వంటివి) మిగల్చాలి. లేదంటే స్వల్పకాలిక రుణాలే బెటర్.
-నాగేంద్ర సాయి కుందవరం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

