Personal Finance Tips | ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా? అపార్ట్మెంట్లో ఫ్లాట్‌లో తీసుకోవాలా? ఏది కొంటే బెటర్?
Personal Finance Tips | ఒకప్పుడు సొంతింటి కల దాదాపు అందరికీ ఒకేలా వచ్చేది. ఇప్పుడు అది రెండురకాలుగా పలకరిస్తున్నది. ఒక రోజు ఇండిపెండెంట్ ఇంటిగా, ఇంకోరోజు అపార్ట్మెంట్ ఫ్లాట్‌గా కల వరించి సగటు మానవుణ్ని కలవరపాటుకు గురిచేస్తున్నది.
Personal Finance Tips | ఒకప్పుడు సొంతింటి కల దాదాపు అందరికీ ఒకేలా వచ్చేది. ఇప్పుడు అది రెండురకాలుగా పలకరిస్తున్నది. ఒక రోజు ఇండిపెండెంట్ ఇంటిగా, ఇంకోరోజు అపార్ట్మెంట్ ఫ్లాట్‌గా కల వరించి సగటు మానవుణ్ని కలవరపాటుకు గురిచేస్తున్నది. మర్నాటి నుంచి ఇండిపెండెంట్ ఇల్లు కొనడం ఉత్తమమా? ఫ్లాటు కొంటే ప్రయోజనమా? అని తేల్చుకోలేక తికమకపడుతున్నారు చాలామంది. అయితే, ఇంటిని బట్టి మన లక్ష్యాలు మారకూడదు. మన ఉద్దేశాలకు అనుగుణంగా ఇల్లు ఉండాలి! లక్ష్యాలు, ఉద్దేశాలు కాసేపు పక్కనపెడితే, ఏ కలను ఎవరు నెరవేర్చుకోవాలో ఒక అంచనాకు వద్దాం..!!
‘ఇల్లు కట్టి చూడు’ అంటారు పెద్దలు. ఇప్పుడు ఏ ఇల్లు అన్నది ప్రశ్న? రాజధాని నగరంలో ఇండిపెండెంట్ ఇల్లు కట్టించుకోవడం అందరికీ అంత సులభం కాదు. ప్రైమ్ ఏరియాలో లగ్జరీ ఫ్లాట్ కొనడమూ చెప్పినంత తేలిక కాదు. లక్షలు దాటి కోట్ల వ్యవహారంగా మారిపోయింది. పట్టణ ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరగడంతో ఇండిపెండెంట్ ఇల్లు సగటు మధ్యతరగతి మనిషికి కాస్త భారంగానే పరిణమించింది. ఏ ఊళ్లో అయినా సరే, మన స్థాయికి తగ్గ ఇల్లు కట్టుకోవాలని భావించడం తప్పుకాదు! కానీ, కొనబోయే ఇల్లు మనస్థాయిని తెలియజేయాలి అనుకుంటే పొరపాటు. ఎవరి మెప్పు కోసమో ఇంద్రభవనం లాంటి ఇల్లు కొనుగోలు చేస్తే, గృహరుణం భారమై ఆ ఇంట్లో సంతోషంగా గడపలేని పరిస్థితి వస్తుంది.
బడలిక వదలక..
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇండిపెండెంట్ ఇల్లు కొనడం అంటే చాలా ఆలోచించాలి. బడ్జెట్లో ఇండిపెండెంట్ ఇల్లు రావాలంటే నగర శివారులో ప్రయత్నించాల్సిందే! అపార్ట్మెంట్ కల్చర్ తనకు సరిపడదని భావించి సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో ఇండిపెండెంట్ ఇల్లు తీసుకున్న సుధాకర్ కథ మన అనుమానాలను నివృత్తి చేస్తుంది. సుధాకర్ హైటెక్‌సిటీలో ఉద్యోగి. నెలకు లక్ష జీతం. సొంతూరు వరంగల్. వారాంతాల్లో ఊరికి వెళ్లిరావడానికి సులభంగా ఉంటుందని ఘట్కేసర్ పరిసరాల్లో రూ.60 లక్షలతో ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొని ఘనంగా గృహప్రవేశం చేశాడు. రూ.15 లక్షలు డౌన్‌పేమెంట్ కట్టి రూ.45 లక్షలు లోన్ తీసుకున్నాడు. నెలకు రూ.40 వేలు ఈఎమ్ఐ కడుతున్నాడు. మూడు నెలలు ఆడుతూపాడుతూ గడిచిపోయాయి. ఘట్కేసర్ నుంచి హైటెక్‌సిటీకి రానూపోనూ ప్రయాణానికే రోజులో 5 గంటలు పడుతుంది. ప్రయాణ బడలిక వల్ల ఇంటికి వచ్చాక పిల్లలతో ఆడుకునే ఓపిక లేకుండా పోయింది. ఐదురోజుల బడలిక కారణంగా వారాంతాల్లో సొంతూరు వెళ్లొచ్చన్న తన ఆశనేమో విశ్రాంతి మింగేసింది. ఏడాది గడిచే సరికి బ్యాక్‌పెయిన్, కాళ్లులాగడం వంటి అనారోగ్య లక్షణాలు బయట పడసాగాయి. కారణం రోజూ రానూపోనూ 80 కిలోమీటర్లు ప్రయాణించడమే! సొంతిల్లు ఎవరితో పొత్తు లేకుండా, గొప్పగా ఉండాలి అనుకున్నాడే కానీ తనకు ఎదురుకాబోయే సమస్యలను ఊహించలేదు. దీనికితోడు సొంతింటి మమకారం ఆ ఇంటిని ఖాళీ చేయనివ్వలేదు. మూడేండ్లు గడిచాక గానీ, రోజూ తనెంత సమయం వృథా చేస్తున్నాడో సుధాకర్‌కు అర్థం కాలేదు. ఇంటిని అద్దెకు ఇచ్చి ఆఫీస్ దగ్గర మరో అద్దె ఇంట్లోకి మారాడు! శివారులో వచ్చే అద్దె రూ.8 వేలు. ఆఫీస్ దగ్గర అతను ఉంటున్న ఇంటి కిరాయి రూ.18 వేలు. దీనికితోడు ఇంటి ఈఎమ్ఐ. సొంతింటికి దూరమయ్యాన్న బాధ అదనం!

Home1
అందరికీ అందుబాటులో..సుధాకర్ పరిస్థితి మరెవరికీ రావొద్దంటే, సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో తెలివిగా ఆలోచించాలి. సిరిగలవారికి సిటీ సెంటర్లోనూ ఇల్లు కొనే స్తోమత ఉంటుంది. కానీ, మధ్యతరగతి వారికి అది సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఫ్లాట్‌వైపు మొగ్గుచూపడంలో తప్పేం లేదు. శివారులో ఇండిపెండెంట్ ఇంటికోసం వెచ్చించే రూ.60 లక్షలతో మెట్రో ట్రైన్ వసతి ఉన్న లొకేషన్లో ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. ఆస్తి విలువ గురించి ఆలోచిస్తే ఇండిపెండెంట్ ఇంటికి ఉండే విలువ ఫ్లాట్‌కు ఉండే అవకాశమే లేదు! కానీ, కంఫర్ట్ ముఖ్యం. పైగా మనం ఉండబోయే ఇంటిని పెట్టుబడిగా భావించొద్దు. అంతేకాదు, పిల్లలకు మంచి పాఠశాలలు అందుబాటులో ఉండే లొకేషన్లో ఉండాలి కానీ, ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్స్ వెతకాల్సిన పరిస్థితి రావొద్దు. అన్నిటికీ మించి ఇల్లు ఆరోగ్యాన్నీ, ప్రశాంతతను ఇచ్చేదై ఉండాలి. ప్రయాణంలోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతే, ఎంత రాజభవనంలో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? ఇండిపెండెంట్ ఇల్లయినా, ఫ్లాట్ అయినా మీ అవసరాలకు తగ్గట్టు ఉండాలే కానీ, ఇంటి అవసరాల కోసం సమయాన్ని, జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
తొందరొద్దు
సంపన్నులైతే నగరం నడిబొడ్డున ఇల్లు తీసుకున్నా వచ్చే నష్టమేం ఉండదు. కానీ, రుణాలు తీసుకొని, పైసాపైసా కూడబెట్టే మధ్యతరగతి వాళ్లు ఈ విషయంలో తొందరపడొద్దు. సెక్యూరిటీ, నలుగురితో కలిసి ఉండే అవకాశం అపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటుంది. నాలుగు రోజులు ఇంటికి తాళం పెట్టి ఊరికి వెళ్లినా భయం ఉండదు. సౌకర్యాలు, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలే గానీ, కలల సౌధం ఏ తీరానైనా కట్టితీరాలన్న పట్టుదల పనికిరాదు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Home Loan | హోంలోన్ తీసుకున్న వారికి అలర్ట్.. వడ్డీరేటు పెరిగినప్పుడు ఈ చిన్న టిప్స్ పాటించండి
“Commercial Property | ఇల్లు కొంటే మంచిదా? కమర్షియల్ ప్రాపర్టీ కొంటే లాభమా?”
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

