Pepsi | న్యూఢిల్లీ, మార్చి 1: అంతర్జాతీయ శీతలపానియాల సంస్థ పెప్సీకో.. రీబ్రాండింగ్లో భాగంగా నూతన లోగోను ఆవిష్కరించింది. 14 ఏండ్ల తర్వాత లోగోను మార్చడం ఇదే తొలిసారని అమెరికాకు చెందిన శీతల పానియాల సంస్థ ప్రకటించింది. నూతన లోగోను ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఆవిష్కరించింది.