న్యూఢిల్లీ, జూన్ 30 : అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిర్మాణానికి పెన్షన్ ఫండ్స్ దోహదం చేయగలవని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ అన్నారు.
పెన్షన్ సేవింగ్స్ కాలవ్యవధి ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇవి మౌలిక సదుపాయాల నిర్మాణానికి, వికసిత్ భారత్ సాధనకు అనువైనవని మంగళవారం ఇక్కడ పీఎఫ్ఆర్డీఏ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే పెన్షన్ ఫండ్స్‌ను వృద్ధిదాయక పెట్టుబడులుగా అభివర్ణించారు.