Cop Threaten Protesters | ‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. నిరసనకారులను బెదిరించిన పోలీస్, సస్పెండ్
Cop Threaten Protesters | నీట్ లీక్‌పై ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని కొంతమంది నిరసనకారులను పోలీస్ అధికారి బెదిరించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
ముంబై: నీట్ లీక్‌పై ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని కొంతమంది నిరసనకారులను పోలీస్ అధికారి బెదిరించారు. (Cop Threaten Protesters) ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా ముంబైలోని శివాజీ పార్క్, చెంబూర్, ఆజాద్ మైదాన్‌తో సహా కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, జనం నిరసనలు చేస్తున్నారు.
కాగా, ఒక నిరసన ప్రదేశం నుంచి కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యాన్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులను ఒక పోలీస్ అధికారి హెచ్చరించారు. ‘మీరు మళ్లీ ఇక్కడ కనిపిస్తే, మీ జీవితాలను నాశనం చేస్తా. మీ బ్యాగుల్లో 50 గ్రాముల చొప్పున డ్రగ్స్ పెడతా. మిమల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా. అప్పుడు మీకు బెయిల్ రాదు. జైల్లోనే మీ జీవితం ముగిసిపోతుంది’ అని బెదిరించారు. మీ నిరసనల వల్ల తన జీవితం కష్టంగా మారిందని ఆయన అన్నారు.
మరోవైపు ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. దీంతో ఆ పోలీస్ అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముంబై డీసీపీ స్పందించారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తేలే వరకు వీడియోలో పోలీస్ యూనిఫాంలో కనిపించిన డ్రైవర్‌ను ఆయన ప్రస్తుత పోస్టింగ్ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.
The Mumbai Police are threatening students who are protesting, warning that if they return,
they will be framed in a drug case and end up spending their entire lives in jail. pic.twitter.com/6b7J7AeJ93— Bhavesh Makwana (@Bhaveshmakwana_) July 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

