Paytm | ఆర్బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ తన కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రాజీవ్ కృష్ణమురళీలాల్ అగర్వాల్‌ను నియమించుకున్నది. రాజీవ్ కృష్ణమురళీలాల్ అగర్వాల్.. సెబీ మాజీ హోల్ టైం సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం పేటీఎం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ్ అరోరా వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రాజీవ్ కృష్ణమురళీలాల్ అగర్వాల్‌ను పేటీఎం నియమించుకున్నది. రాజీవ్ కృష్ణ మురళీలాల్ పదవీకాలం ఐదేండ్లు ఉంటుందని సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం వెల్లడించింది. ఇదిలా ఉంటే పేటీఎం తన మూవీస్, ఈవెంట్ టికెటింగ్ బిజినెస్’ను ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’కు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నాయని ధృవీకరించింది.