బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Feb 05, 2021 , 22:05:02

PayPal షాకింగ్ డిసిష‌న్‌: ఏప్రిల్ నుంచి భార‌త్‌లో సేవ‌లు బంద్‌!

PayPal షాకింగ్ డిసిష‌న్‌: ఏప్రిల్ నుంచి భార‌త్‌లో సేవ‌లు బంద్‌!

న్యూఢిల్లీ: గ‌్లోబ‌ల్ డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్.. పేపాల్‌.. వ‌చ్చే ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి భార‌త‌దేశంలోని పేమెంట్ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. భార‌త్‌లో బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ల‌లో పే పాల్ సంస్థ‌కు యూనిట్లు ఉన్నాయి. అమెరికా ఆవ‌ల అత్య‌ధిక కేంద్రాలున్న‌ది మ‌న‌దేశంలోనే. అలాగే భార‌త్‌లో బిజినెస్ డెవ‌ల‌ప్మెంట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్న‌ది. ఇక నుంచి ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్మెంట్‌లో పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తామ‌ని పేపాల్ తెలిపింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 35 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను చేరుకునే ల‌క్ష్యంతో ప‌ని చేస్తోంది. 

గ‌తేడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.4 బిలియ‌న్ల విక్ర‌యాలు జ‌రిపింది. భార‌త్‌లో 3.6 ల‌క్ష‌ల పై చిలుకు మ‌ర్చంట్లు ఉన్నారు. 2020 నాలుగో త్రైమాసికంలో 6.12 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ సంపాదించ‌డంతోపాటు గ‌ణ‌నీయ పురోగ‌తి సాధించామ‌ని పేపాల్ తెలిపింది. 39 శాతం గ్రోత్ సాధించిన పేపాల్‌.. మొత్తం చెల్లింపుల విలువ 277 బిలియ‌న్ల డాల‌ర్లు. నాలుగో త్రైమాసికంలో కొత్త‌గా 1.6 కోట్ల ఖాతాదారులు పేపాల్‌కు జ‌మ అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo