LIC Saral Pension Yojana | మెజారిటీ ప్రజానీకం మెరుగైన జీవితాన్ని కోరుకుంటారు. మెరుగైన జీవితం భారీ ఖర్చుతో కూడుకున్నదైనా జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక అవసరం. సంపన్న నగరాలతోపాటు చిన్న పట్టణాలు, నగరాల్లోనూ ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అత్యధికులు గరిష్టంగా సురక్షిత రిటర్న్స్ వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గుతుంటారు. ఇటువంటి ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఎల్ఐసీలో 40 ఏండ్ల వయస్సులోనే పెట్టుబడి పెడితే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు సరల్ పెన్షన్ యోజన సరైంది.. 40 ఏండ్ల వయస్సులో స్కీమ్‌లో చేరినా మీరు పెన్షన్ పొందొచ్చు. దీని వివరాలేంటో చూద్దామా.. !
పాలసీ ప్రీమియం ఇలా.. ఇది సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. జీవితంలో ఒకేఒకసారి ప్రీమియం పే చేస్తే జీవితానికి అవసరమైన మొత్తం సంపాదించొచ్చు. సరల్ పెన్షన్ యోజనా తక్షణ యాన్యుటీ ప్లాన్. అంటే ప్రీమియం కట్టి పాలసీ తీసుకున్నారంటేనే మీరు పెన్షన్ పొందుతారని అర్థం. అయితే, ఈ పాలసీని ఇతరులకు మార్చొద్దు. పెన్షనర్ జీవించి ఉన్నంత వరకు అతడికి పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ మరణిస్తే బేస్ ప్రీమియం నామినీకి చెల్లిస్తారు.
సరల్ పెన్షన్ పథకంలో జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ఫెసిలిటీ ఉంది. ఇది భార్యాభర్తలిద్దరికీ కవరేజీ కల్పిస్తుంది. వారు తమ జీవిత కాలం అంతా పెన్షన్ పొందుతారు. ఒకవేళ వారిలో ఒకరు మరణించినా.. మిగతా వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. భర్త మరణిస్తే, బేస్ ప్రీమియం తన భార్య లేదా నామినీకి చెల్లిస్తారు.
40 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వరకు ఈ స్కీమ్ కింద పాలసీలో చేరొచ్చు. పాలసీలో చేరిన ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాది కోసారి కూడా ఈ పెన్షన్ పొందొచ్చు.
ఒకవేళ ప్రతి నెలా పెన్షన్ పొందాలని మీరు కోరుకుంటే కనీసం రూ.1000 పెన్షన్ లభిస్తుంది. కనీసం రూ.12 వేల పెన్షన్ కావాలనుకుంటే సింగిల్ ప్రీమియం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రతి ఏటా రూ.50,250 పెన్షన్ పొందుతారు. ఐదు శాతం నగదు డిడక్ట్ చేశాక.. మధ్యలో మరికొంత సొమ్ము డిపాజిట్ చేయొచ్చు.