హైదరాబాద్, మే 21 : ప్యారడైజ్ బిర్యానీ విస్తరణ బాట పట్టింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా మరో 100 అవుట్లెట్లను తెరువనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో అభిక్ మిత్రా తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలలో 57 అవుట్లెట్లు ఉండగా, వచ్చే మూడేండ్లకాలంలో బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, న్యూఢిల్లీ, ముంబై మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు.
ఇందుకోసం 100 అవుట్లెట్లను తెరువడానికి రూ.100 కోట్ల వరకు పెట్టుబడిగా పెడుతున్నట్టు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.280 కోట్లుగా ఉన్న టర్నోవర్, వచ్చే మూడేండ్లలో రూ.500 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్యారడైజ్ బిర్యానీలో 100 శాతం వాటా కలిగివున్న సమారా క్యాపిటల్ ఈ నిధులను సమకూర్చనున్నది.