కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ అష్మిత చాలిహా క్వార్టర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-13, 21-16తో లోకల్ షట్లర్ జో జిన్ వీపై అలవోక విజయం సాధించింది. క్వార్టర్స్‌లో తను ఎనిమిదో సీడ్ డెన్మార్క్ ప్లేయర్ లైన్ హజ్మార్క్ తలపడనుంది.
హజ్మార్క్ 16-21,21-8, 21-15తో మరో భారత షట్లర్ మాళవిక బన్సోద్‌ను ఓడించింది. ఇంకో మ్యాచ్‌లో దేవిక సిహగ్ 16-21, 13-21తో చెన్ యుఫీ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో హరిహరణ్- ఎంఆర్ అర్జున్, మిక్స్డ్ డబుల్స్‌లో కనపురమ్ సాత్విక్-రాధిక శర్మ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టారు.