హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అతి తక్కువ పెన్షన్‌తో రిటైర్డ్ బొగ్గు గని కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, పెట్రోలియం కంపెనీల తరహాలో కోల్ ఇండియా, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకూ ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు సోమవారం సింగరేణి భవన్లో సింగరేణి గుర్తింపు సంఘం నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసోసియేషన్ అధ్యక్షుడు డీ రామచందర్‌రావు వినతి పత్రాన్ని సమర్పించారు.