హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న క్లౌడ్ కమ్యూనికేషన్స్ సొల్యుషన్స్ కంపెనీ ఓజోన్‌టెల్..క్లౌడ్కనెక్ట్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా యూకాస్ మార్కెట్ 50 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఈ ఒప్పందం పరోక్షంగా దోహదం చేయనున్నది. కమ్యూనికేషన్, కస్టమర్ ఎంగేజ్మెంట్, ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ వంటి విభాగాలకు సేవలు అందించడానికి ఈ కొనుగోలు ఒప్పందం దోహదం చేయనున్నదని ఓజోన్‌టెల్ ఫౌండర్, సీఈవో అతుల్ శర్మ తెలిపారు.