పటాన్చెరు, మే 20: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్‌లో ఆర్హోమ్స్, జేవీఆర్జే గ్రూప్, జనతా ఎస్టేట్స్ సారథ్యంలో జై వాసవీస్ ఓఆర్ఆర్ హైట్స్ నిర్మాణం జరుగుతున్నది. శనివారం జరిగిన ఈ ప్రాజెక్టు భూమిపూజలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పాల్గొన్నారు. ఓఆర్ఆర్ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.