Oppo Reno11 | ప్రముఖ చైనా టెక్ కంపెనీ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 11(Oppo Reno 11) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 12 మధ్యాహ్నం 11 గంటలకు ఒప్పో రెనో11 (Oppo Reno11), ఒప్పో రెనో11 ప్రో (Oppo Reno11 Pro) ఫోన్లను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. అధికారిక సోషల్ మీడియా చానెళ్ల ద్వారా లైవ్ స్ట్రీమ్‌లో ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్లు రెండూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో కర్వ్డ్ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. అయితే ఒప్పో రెనో11 ప్రో 5జీ ఫోన్ 1.5 కే రిజొల్యూషన్‌తో 6.74 -అంగుళాల స్క్రీన్, ఒప్పో రెనో 11 ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే ఉంటది. ఒప్పో రెనో11 ప్రో ఫోన్ 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఒప్పో రెనో 11 ఫోన్ 950 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి.
ఒప్పో రెనో 11 ప్రో ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, ఒప్పో రెనో11 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 చిప్ సెట్ కలిగి ఉంటాయి. రెండూ ఫోన్లు 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తాయి. రెండింటిలోనూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ యూనిట్ కలిగి ఉంటాయి. రెండింటిలోనూ సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఒప్పో రెనో11 ప్రో వేరియంట్ ఫోన్ 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఒప్పో రెనో11 ఫోన్ 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 స్కిన్ వర్షన్‌పై పని చేస్తాయి. వై-ఫై 6, యూఎస్బీ-సీ పోర్ట్, సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. ఒప్పో రెనో11 5జీ ఫోన్ రూ.28 వేలు, ఒప్పో రెనో11ప్రో 5జీ ఫోన్ రూ.35 వేలు పలుకుతుందని తెలుస్తున్నది. వివో వై29, శాంసంగ్ గెలాక్సీ ఏ34 సిరీస్ ఫోన్లకు ఒప్పో రెనో11 5జీ సిరీస్ ఫోన్లు గట్టి పోటీ ఇస్తాయని చెబుతున్నారు.