Oppo Reno 11 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో11 (Oppo Reno11) సిరీస్ ఫోన్లను ఈ నెల 23న చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు వేరియంట్లు – ఒప్పో రెనో 11, ఒప్పో రెనో11 ప్రో వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. తొలుత చైనా మార్కెట్లో ఆవిష్కరించిన పిమ్మట భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలోకి తెస్తారని సమాచారం. ఈ రెండు వేరియంట్ ఫోన్ల కోసం ప్రీ-బికంగ్స్ ప్రారంభం అయ్యాయి.
ఫ్లాగ్ షిప్ ఇమేజింగ్ ఆల్గోరిథమ్స్ తో వస్తున్న ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్లు 50-మెగా పిక్సెల్ ఎస్ఎల్ఆర్ పొర్ట్రైట్ లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ 47 ఎంఎం ఫోకల్ లెంత్ సెన్సర్ తో వస్తాయని సమాచారం. ఒప్పో రెనో11 ఫోన్లు ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుందని సమాచారం.