Oppo Reno 10 5G Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లో సోమవారం తన ప్రీమియం ఒప్పో రెనో10 5జీ (Oppo Reno 10 5G) సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. ఒప్పో రెనో10 5జీ, ఒప్పో రెనో10 ప్రో 5జీ (Oppo Reno 10 Pro 5G), ఒప్పో రెనో10 ప్రో+ 5జీ (Reno 10 Pro+ 5G) ఫోన్లు ఆవిష్కరించింది. న్యూ రెనో సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్-13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్‌పై పని చేస్తాయి. ఈ ఫోన్లు 6.7-అంగుళాల డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. కెమెరా ఫోకస్డ్ ఒప్పో రెనో10 5జీ ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 32-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 సెల్ఫీ షూటర్ (Sony IMX709) కలిగి ఉంటాయి. ఒప్పో రెనో 10 (Oppo Reno 10) 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్సెట్, ఒప్పోరెనో10 5జీ ప్రో (Oppo Reno 10 Pro 5G) ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్సెట్, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ (Oppo Reno 10 Pro+ 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. ఈ మూడు ఫోన్లు గత మే నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించారు.
ఒప్పో రెనో10 ప్రో+5జీ (Oppo Reno 10 Pro+ 5G) 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.54,999 లకు లభిస్తుంది. ఒప్పో రెనో10 ప్రో 5జీ (Oppo Reno 10 Pro 5G) 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 నుంచి ప్రారంభం అవుతుంది. రెండు వేరియంట్లు గ్లోసీ పర్పుల్, సిల్వరీ గ్రే షేడ్స్ కలర్స్‌లో లభిస్తాయి.
ఇక ఒప్పో రెనో10 5జీ (Oppo Reno 10 5G) ఫోన్ ధర ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తుంది. ఐస్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఒప్పో రెనో10 ప్రో 5జీ (Oppo Reno 10 Pro 5G) ఒప్పో రెనో10 ప్రో+ 5జీ (Oppo Reno 10 Pro+ 5G) వేరియంట్లు ఈ నెల 13 నుంచి కొనుక్కోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్, దేశంలోని ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
ఒప్పో రెనో10ప్రో+ 5జీ ఫోన్ (Oppo Reno 10 Pro+ 5G) ఆండ్రాయిడ్13-బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.74-అంగుళాల (1,240x 2,722 పిక్సెల్స్) అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే విత్ హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ ఎల్టీపీఎస్ డైనమిక్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సర్ విత్ ఎఫ్/2.5 అపెర్చర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్ అండ్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్‌తోకూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ కెమెరా వస్తుంది.
ఒప్పో రెనో10ప్రో + 5జీ ఫోన్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలోమీటర్, ఆంబియెంట్ లైట్ సెన్సర్, ఆంబియెంట్ కలర్ టెంపరేచర్ సెన్సర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తోపాటు బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ సెన్సర్ ఉంటాయి. 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 100 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. కేవలం 27 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్‌తో 1.6 రోజులు బ్యాటరీ లైఫ్ ఉంటది.
ఒప్పో రెనో10 ప్రో 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1,080X 2,412 పిక్సెల్స్) ఓలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఒక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇన్ బిల్ల్12 జీబీ రామ్ కెపాసిటీ గల ఈ ఫోన్‌ను వర్చువల్‌గా మరో 8జీబీ పెంచుకోవచ్చు.
ఒప్పో రెనో10 ప్రో 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్ విత్ ఓఐఎస్, 32-మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సర్, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఒప్పో రెనో10 ప్రో+ 5జీలో మాదిరిగానే కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. బయో అథంటికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ సెన్సర్ ఉంటాయి. ఈ ఫోన్ 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 80వాట్ల సూపర్ వూక్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 28 నిమిషాల్లో చార్జింగ్ అవుతుంది.
ఒప్పో రెనో10 5జీ (Oppo Reno 10 5G) ఫోన్లోనూ ఒప్పో రెనో10 ప్రో 5జీ ఫోన్ స్పెషిఫికేషన్స్ ఉంటాయి. ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది. ఇందులోనూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.7 లెన్స్ ఆటోఫోకస్ అండ్ ఓఐఎస్, 32-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. రెనో10 ప్రో, రెనో10 ప్రో+ వేరియంట్లలో మాదిరే కనెక్టివిటీ, సెన్సర్లు ఉంటాయి. బయో అథంటికేషన్ కోసం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ సెన్సర్ ఉంటాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 47 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది.