Oppo Find N2 Flip | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఈ నెల 13న భారత్ మార్కెట్లోకి ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకు రానున్నది. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారానే విక్రయించనున్నది. భారత్ మార్కెట్లో ఇంకా ధర వెల్లడించలేదు. కానీ ఇప్పటికే ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఫోన్ ఎక్చ్చేంజ్ కింద రూ.5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది ఒప్పో.
అమెరికా ఎక్స్‌ప్రెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులపై రూ.5000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. తొమ్మిది నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.80 వేలు ఉండొచ్చునని అంచనా. అస్ట్రాల్ బ్లాక్, మూన్లిట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. బ్రిటన్‌లో ఇప్పటికే ఆవిష్కరించిన ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ధర 849 జీబీపీ (పౌండ్లు) (దాదాపు రూ.84,300) పలుకుతుంది.