Oppo A79 5G | ఒప్పో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ79 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Oppo A79 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo A79 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది. అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, మెటాలిక్ లైక్ టెక్చర్‌తోపాటు పాలికార్బోనేట్ ఫ్రేమ్‌తో రూపుదిద్దుకున్నదీ ఫోన్.
ఒప్పో ఏ79 5జీ ఫోన్ ధర ఇలా
ఒప్పో ఏ79 5జీ ఫోన్ రూ.19,999లకు లభిస్తుంది. ఒప్పో ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మిస్టరీ బ్లాక్, గ్లోయింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
దీపావళి పండుగ నేపథ్యంలో ఒప్పో తన స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్, వన్ కార్డ్ లతో కొనుగోలు చేస్తే రూ.4000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నది.
బజాజ్ ఫైన్ సర్వ్, టీవీఎస్ క్రెడిట్, హోం క్రెడిట్, హెచ్డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్ సంస్థల నుంచి జీరో డౌన్ పేమెంట్ స్కీమ్స్ కూడా పొందొచ్చు.
ఒప్పో కస్టమర్లకు పాత ఫోన్లు ఎక్స్చేంజ్ చేస్తే రూ.4000 ఎక్స్చేంజ్ బోనస్ అందుకోవచ్చు. ఒప్పో స్మార్ట్ ఫోన్ తోపాటు ఏ వస్తువు కొనుగోలు చేసినా రూ.10 లక్షల వరకూ క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు.
ఇవీ స్పెషిఫికేషన్స్
ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. 8జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 1080×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్ కలిగి ఉంటది. 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుందీ ఒప్పో ఏ79 5జీ ఫోన్. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ పొర్ట్రట్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా వస్తుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

