Oppo A58 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లోకి త్వరలో తన ఒప్పో ఏ58 4జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. గతేడాది మార్కెట్లోకి తీసుకొచ్చిన ఒప్పో ఏ58 5జీ, ఒప్పో ఏ58ఎక్స్ 5జీ ఫోన్లకు కొనసాగింపుగా ఒప్పో ఏ58 4జీ ఫోన్ వస్తున్నది.
ఒప్పో ఏ58 4జీ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 ఉండవచ్చునని భావిస్తున్నారు. మంగళవారం నుంచి మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. భారత్ మార్కెట్లో ఈ నెల 10 నుంచి లభిస్తుంది. డాజ్లింగ్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఒప్పో ఏ58 4జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 2.8డీ కర్వ్డ్ బాడీ, గ్లోయింగ్ స్కిల్ డిజైన్‌లో మెరుస్తుంటుంది. బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ సెన్సర్ ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్ సెట్ విత్ మాలి జీ52 ఎంసీ2 జీపీయూతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్ మీద పని చేస్తుంది.
ఒప్పో ఏ58 4జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33వాట్ల వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.