హైదరాబాద్, జూన్ 11: ఐటీ సేవల సంస్థ ఓపెన్ టెక్స్.. హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని ఫోనిక్ టెక్ జోన్లో ఏర్పాటు చేసిన ఈ నూతన ఆఫీస్‌లో ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ముహి మజూబ్ తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగానే కొత్త ఆఫీస్ తెచ్చామని, దీంతో ప్రొడక్ట్ డెవలప్మెంట్ బలోపేతం కాగలదన్నారు. 2010 నుంచి హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థకు బెంగళూరు, చెన్నైలతో కలుపుకొని మొత్తంగా 6 వేల మంది సిబ్బంది ఉన్నారు.