Claude 3.5 Sonnet : 2022 నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన అనంతరం ఈ ఏఐ చాట్‌బాట్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగింది. చాట్‌జీపీటీకి యూజర్ల నుంచి విశేష ఆదరణ లభించడంతో టెక్ దిగ్గజాలు సొంత ఏఐ టూల్స్‌ను డెవలప్ చేయడంపై దృష్టి సారించాయి.
ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగులు నెలకొల్పిన కంపెనీ ఆంత్రోపిక్ తాజాగా క్లాడ్ 3.5 సొనెట్ పేరిట తన నూతన ఏఐ మోడల్‌ను లాంఛ్ చేసింది. క్లాడ్ 3.5 సొనెట్ ఇప్పటివరకూ తన అత్యంత సామర్ధ్యంతో కూడిన మోడల్ అని ఆంత్రోపిక్ చెబుతోంది.
క్లాడ్ 3.5 సొనెట్ టెక్ట్స్, ఇమేజ్‌లు, అనలైజ్ చేయడంతో పాటు వివిధ ఏఐ బెంచ్‌మార్క్‌లపై మెరుగైన సామర్ధ్యంతో టెక్ట్స్‌ను జనరేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. పనితీరులో ముఖ్యంగా కోడింగ్, గణితం, విజన్, రీడింగ్ కాంప్రెహెన్షన్ విషయాల్లో లేటెస్ట్ మోడల్ క్లాడ్ 3 సొనెట్, క్లాడ్ 3 ఒపస్లను అధిగమిస్తుందని వెల్లడించింది.
ఓపెన్ఏఐ జీపీటీ-4౦ సహా ప్రముఖ మోడల్స్‌ను మించి క్లాడ్ 3.5 సొనెట్ సామర్ధ్యం ఉంటుందని ఆంత్రోపిక్ చేపట్టిన నిర్ధిష్ట పరీక్షల్లో వెల్లడైంది. క్లాడ్ 3 ఒపస్ కంటే రెండింతల వేగంతో లేటెస్ట్ మోడల్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్ సర్వీస్ చాట్‌బాట్స్ వంటి ప్రాంప్ట్ రెస్పాన్స్‌లకు సంబంధించిన యాప్స్‌కు ఈ మోడల్ ఉపకరిస్తుందని పేర్కొంది.
Read More :