OnePlus Nord CE4 | వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?!
OnePlus Nord CE4 | చైనా టెక్నాలజీ సంస్థ వన్ ప్లస్ తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్‌ను ఏప్రిల్ ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
OnePlus Nord CE4 | చైనా టెక్నాలజీ సంస్థ వన్ ప్లస్ తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్‌ను ఏప్రిల్ ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ ధర రూ.25 వేలు ఉండొచ్చునని భావిస్తున్నారు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో (1440×3168 పిక్సెల్స్ రిజొల్యూషన్) 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రేర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉండవచ్చునని తెలుస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్. 8జీబీ ర్యామ్ తో వస్తున్న ఈ ఫోన్ లో అదనంగా మరో 8 జీబీ ర్యామ్ వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఇన్ బిల్ట్ స్టోరేజీ 256 జీబీగా ఉంటుంది.. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

