IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
IndiGo Flight | ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో గువాహటి (Guwahati) కి వెళ్లాల్సిన ఇండిగో విమానం (IndiGo flight) అత్యవసరంగా పుణె ఎయిర్‌పోర్టు (Pune Airport) లో ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ తర్వాత విమానం ల్యాండింగ్ గేర్ వెనక్కి ముడుచుకోకపోవడంతో పుణెకు తిరిగి వచ్చింది.
IndiGo Flight : ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో గువాహటి (Guwahati) కి వెళ్లాల్సిన ఇండిగో విమానం (IndiGo flight) అత్యవసరంగా పుణె ఎయిర్‌పోర్టు (Pune Airport) లో ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ తర్వాత విమానం ల్యాండింగ్ గేర్ వెనక్కి ముడుచుకోకపోవడంతో పుణెకు తిరిగి వచ్చింది. ఫ్లైట్ 6E 0623 (VT-IZE) పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కి సమాచారం అందించడంతో భారత వైమానిక దళం (IAF) పుణె ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఈ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు, అత్యవసర ప్రతిస్పందన బృందాలను అత్యంత అప్రమత్తంగా ఉంచారు. 192 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న ఆ విమానం ఉదయం 9:04 గంటలకు సురక్షితంగా ల్యాండయ్యింది. ల్యాండింగ్‌కు ముందు గ్రౌండ్ బృందాలు ల్యాండింగ్ గేర్‌ను ప్రత్యక్షంగా తనిఖీ చేయడానికి వీలుగా రన్‌వేపై తక్కువ ఎత్తులో ప్రయాణించింది. మూడు ఫైర్ ఇంజిన్లు, రెండు అంబులెన్స్‌ల సాయంతో ప్రయాణికులు, సిబ్బంది అందరినీ ఏరోబ్రిడ్జ్ ఉపయోగించి బే నంబర్ 7కు సురక్షితంగా తరలించారు.
ఈ ప్రక్రియలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఉదయం 9:10 గంటలకు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని అధికారికంగా ఉపసంహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Hit and run | ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్.. బాలుడికి గాయాలు
Train accident | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు : వీడియో
Lifestyle Diseases | గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులు ఇవే.. నిద్ర సరిగ్గా ఉంటే ఈ వ్యాధులకు చెక్..
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

