OnePlus 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) తన వన్ప్లస్ 13 (OnePlus 13) ఫోన్ ను ఈ నెల 31న చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ న్యూ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. మూడు రంగుల ఆప్షన్లలో మార్కెట్లోకి వస్తున్నది. త్వరలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారు.
వన్ ప్లస్ 13 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు హెచ్డీఆర్+, డోల్బీ విజన్, సెకండ్ జనరేషన్ ఓరియంటల్ ఎక్స్2 8టీ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఐ -ప్రోటెక్షన్ కోసం యాంటీ ఫ్లిక్కర్ టెక్నాలజీతో డీసీ డిమ్మింగ్ సపోర్ట్ ఆఫర్ చేస్తుంది. తడి చేతులతోనూ ఆపరేట్ చేసేందుకు వీలుగా రైన్ టచ్ 2.0 టెక్నాలజీ కూడా ఉంటుంది.
వన్ప్లస్ 13 ఫోన్ 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. హసిల్ బాండ్ ట్యూన్ చేసిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ -808 ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50-మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా విత్ 120 – డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటాయి.