హైదరాబాద్: కంపెనీ లాభాల్లోంచి షేర్హోల్డర్లకు చెల్లించే డివిడెండ్‌ను బిట్‌కాయిన్ రూపంలో ఇవ్వనున్నట్లు అమెరికా ఐటీ కంపెనీ ఒకటి ప్రకటించింది. బ్లాక్‌చైన్ ఇన్ఫ్రా టెక్నాలజీ వ్యాపారంలో నిమగ్నమైన బీటీసీఎస్..బివిడెండ్ (బిట్‌కాయిన్‌తో చెల్లించే డివిడెండ్) ఇస్తామని వెల్లడించింది. ఈ ప్రకటన చేసినంతనే నాస్డాక్ ఎక్సేంజ్‌లో ఈ షేరు జనవరి 5న ఒక్క రోజులో 44 శాతం ర్యాలీ జరిపి, 3.02 డాలర్ల నుంచి 4.36 డాలర్ల వద్దకు చేరింది. ఒక్కో షేరుకు 0.05 డాలర్ల చొప్పున బిట్‌కాయిన్ రూపంలో చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది.