హైదరాబాద్, జనవరి 25: మెయిల్ గ్రూపునకు చెదిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.248 కోట్ల ఆదాయంపై రూ.24.7 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2.22 కోట్ల లాభంతో పోలిస్తే 136 శాతం ఎగబాకింది. ఈ సందర్భంగా కంపెనీ సీంఎడీ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ..గత కొన్ని త్రైమాసికాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈవీ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఒలెక్ట్రా స్థిరమైన రాబడితోపాటు మార్జిన్లలో వృద్ధి నమోదైందన్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సంస్థ వద్ద 3,220 ఈ-బస్సుల ఆర్డర్లు ఉండగా..గత త్రైమాసికంలో 142 బస్సులను డెలివరీ చేసింది.