హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్.. హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్‌కు హోమోలోగేషన్ సర్టిఫికెట్‌ను పొందింది. భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినట్లు సంస్థ వెల్లడించింది.
కేంద్రీయ మోటారు వాహన నింబంధనలకు అనుగుణంగా.. ఒలెక్ట్రా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రోడ్డుపైకి వచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించినట్లు అయ్యా యి. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ..దేశంలో ఎలక్ట్రిక్ హెవీ వెహికల్ సెగ్మెంట్లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నదని, ఈ-టిప్పర్ దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్గా నిలిచిందని చెప్పారు.