Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ నుంచి మరో స్కూటర్.. దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్నది. ‘మా నెక్ట్స్ ప్రొడక్ట్ ఈవెంట్ జూలైలో నిర్వహిస్తాం` అని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ‘ఈసీఈ తరానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. అందుకు సంకేతంగా జూలైలో నిర్వహించే ఈవెంట్ ఉంటుంది’ అని భవీష్ అగర్వాల్ ఆ ట్వీట్లో పేర్కొ్న్నారు. అంతే కాదు.. హెల్మెట్ ధరిస్తే, ఈ స్కూటర్ స్టార్ట్ అయ్యేలా టెక్నాలజీ అభివృద్ధి చేసేలా డిజైన్ చేశారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్కూటర్‌తో పోలిస్తే టూరిస్ట్ అడ్వెంచరిక్ స్కూటర్‌గా మార్కెట్లో నిలవనున్నది.
భవిష్ అగర్వాల్.. కొత్త స్కూటర్ హెడ్ లైట్ ఫోటో ట్వీట్ చేశారు. హెడ్ ల్యాంప్ విజిబుల్‌గా ఉంటుందని తెలుస్తున్నది. దీని ప్రకారం కొత్త స్కూటర్లో ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా ఉండవచ్చునని తెలుస్తున్నది. ఇప్పటికే ఉన్న ఫీచర్లతోపాటు కొత్త ఫీచర్లు జత కలుపవచ్చునని సమాచారం.
కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ‘హెల్మెట్ డిటెక్షన్ సిస్టమ్’ ప్రవేశ పెడతారని సమాచారం. ఈ సిస్టమ్ ప్రకారం సంబంధిత రైడర్.. హెల్మెట్ ధరించకుంటే ఆ స్కూటర్ స్టార్ట్ కాదు. సైడ్ స్టాండ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీకి అనుగుణంగా పని చేసేలా ఈ సేఫ్టీ ఫీచర్ పని చేస్తుందని తెలుస్తున్నది.
ఈ సిస్టమ్ ప్రకారం రైడర్ హెల్మెట్ ధరించారా.. లేదా.. తెలుసుకునేందుకు కెమెరాలు వినియోగిస్తారు. ఈ కెమెరా సాయంతో రైడర్ ఇమేజ్‌ని వెహికల్ కంట్రోల్ (వీసీయూ) స్వీకరిస్తుంది. అక్కడ నుంచి మోటార్ కంట్రోల్ యూనిట్ (ఎంసీయూ)కు సిగ్నల్ వెళ్లిన తర్వాతే స్కూటర్ స్టార్ట్ అవుతుంది.
స్కూటర్ రైడ్ చేసిన తర్వాత రైడర్ హెల్మెట్ ధరించకపోతే ఆటోమేటిక్‌గా పార్క్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. హెల్మెట్ ధరించాలని సూచిస్తూ రిమైండర్ నోటిఫికేషన్, దాని డాష్ బోర్డు స్క్రీన్ మీద దర్శనం ఇస్తుంది. అంతేకాదు.. హెల్మెట్ దర్శించాలని సంకేతాలిస్తుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఓలా ఎలక్ట్రిక్ ఐదు ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శించింది. ఇప్పటికే మార్కెట్లో ఎస్1, ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ స్కూటర్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఎస్ 1, ఎస్1 ప్రో స్కూటర్లు మార్కెట్లోకి వచ్చినా, ఎస్ 1 ఎయిర్ ఇంకా కస్టమర్లకు అందుబాటులోకి రాలేదు. ఎస్1 ఎయిర్తోపాటు మరో కొత్త స్కూటర్.. ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరిస్తుంది. కొత్తగా వచ్చే ఈ-స్కూటర్ ఎస్1 ఎయిర్.. చౌక ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త ఫీచర్లు జత చేయనున్నట్లు తెలుస్తున్నది.