Ola S1 X | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ‘ఓలా ఎస్1 ఎక్స్’ ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్‌తో 190 కి.మీ దూరం ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ఆరు కిలోవాట్ల సామర్థ్యం గల మోటార్ తో పని చేసే ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో 40 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. గరిష్టంగా 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
రెడ్ వెలాసిటీ, మిడ్ నైట్, వోగ్, స్టీలర్, పంక్, పోర్స్ లెయిన్ వైట్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తుంది. బుకింగ్ చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో డెలివరీ చేయనున్నది. 10.9 సెం.మీ సెగ్మెంటెడ్ డిస్ ప్లేతో వస్తున్న ఈ స్కూటర్ కు ఫిజికల్ కీ అన్ లాక్ ఉంటది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. ఈవీ బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 80 వేల కి.మీ వరకూ వారంటీ ఉచితంగా అందిస్తుంది. కిలోమీటర్ల వారంటీని 1.25 లక్షల కి.మీ వరకూ పొడిగించుకోవచ్చునని తెలిపింది.