Ola Scooter | న్యూఢిల్లీ, మార్చి 13: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..హోలీ పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోలీ ఫ్లాష్ సేల్‌తో ప్రారంభించిన ఈ ఆఫర్ల కింద ఎస్1 ఈ-స్కూటర్లపై రూ.26,750 తగ్గింపునిస్తున్నది. అలాగే ఎస్1 ఎక్స్+(జనరేషన్ 2)పై రూ.22 వేలు డిస్కౌంట్‌ను ఇస్తున్నది. దీంతో ఈ రెండు మాడళ్ల ప్రారంభ ధరలు రూ.89,999, రూ.82,999కి దిగివచ్చాయి.
ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 17 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతోపాటు మిగతా ఎస్1 స్కూటర్లపై కూడా రూ.25 వేల డిస్కౌంట్ ఇస్తున్నది. ప్రస్తుతం సంస్థ మూడు రకాల స్కూటర్లను విక్రయిస్తుండగా, ఇవి రూ.69,999 నుంచి రూ.1,79,999 ధరల శ్రేణిలో లభిస్తున్నాయి. వీటితోపాటు కొత్తగా ఓలా స్కూటర్లను కొనుగోలు చేసిన వారికి రూ10,500 వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. దీంట్లో రూ.2,999 విలువైన మూవ్ ఆపరేటింగ్ సిస్టమ్, రూ.14,999 విలువైన వారెంటీని రూ.7, 499కి అందిస్తున్నది. వీటిలో ఎస్1 ప్రో+ మాడల్ రూ.1,59,999 నుంచి రూ.1.85 లక్షల మధ్యలో లభించనుండగా, ఎస్1 ప్రో మాడల్ రూ.1,29,999 నుంచి రూ.1,54, 999, ఎస్1 ఎక్స్ మాడల్ రూ.89,999 నుంచి రూ.1,19,999 మధ్యలో ధర నిర్ణయించింది.