Ola S1 Air | ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ డెలివరీ ప్రారంభం.. 50 వేలకు పైగా బుకింగ్స్
Ola S1 Air | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎయిర్ స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా స్కూటర్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.
Ola S1 Air | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా.. తన ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air) స్కూటర్ డెలివరీ ప్రారంభించింది. ఈ నెల 15న మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1ఎక్స్, ఎస్1 ప్రో జెన్2 స్కూటర్ల మధ్య బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్ నిలిచింది. ఇప్పటికే 50 వేలకు పైగా ఎస్1 ఎయిర్ స్కూటర్లు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. దీని ధర రూ.1.20 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ప్రకటించింది.
ఎస్1 ఎయిర్ (S1 Air) స్కూటర్లు వందకి పైగా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇతర నగరాల్లో త్వరలో ప్రారంభం అవుతాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని పట్టణ వాసులకు సరైన కంపానియన్‌గా నిలిచింది.
అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్‌తోపాటు తక్కువ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చుతో ఎస్1 ఎయిర్ పని చేస్తుంది. మూడు కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం గల మోటార్‌తో గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్టంగా 151 కి.మీ దూరం ప్రయాణించడం ఈ స్కూటర్ సామర్థ్యం.
ఆరు రంగుల్లో స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, మిడ్నైట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ అండ్ డ్యూయల్-టోన్ బాడీతో ఓలా ఎస్1 ఎయిర్ ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్లు దేశంలో 1000కి పైగా గల ఓలా ఎక్స్పీరియన్స్ కేంద్రాల్లో సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

