Ola Electric IPO | త్వరలో ఐపీవోకు వెళ్లనున్న ఓలా ఎలక్ట్రిక్.. రూ.5,500 కోట్ల నిధుల సేకరణే లక్ష్యం..?!
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఐపీఓకు వెళ్లనున్నది. ఈ మేరకు సెబీ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
Ola Electric IPO | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఐపీవోకు వెళ్లనున్నది. ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధుల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఐపీవోకు అనుమతి కోరుతూ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ సొంతంగా 4.73 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రతిపాదిత ఐపీఓలో ద్వారా 9.52 కోట్ల షేర్లను విక్రయించాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏయే తేదీల్లో ఓలా ఎలక్ట్రిక్ ఐపీవోకు వెళుతుందన్న సంగతి తెలియరాలేదు.
2008లో ఐపీవో ద్వారా బజాజ్ ఆటో.. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన తర్వాత ఒక టూ వీలర్స్ తయారీ సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ ఐపీవోకు వెళ్లడం 15 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ ‘మార్కెట్ లీడర్’గా ఎదిగింది. నవంబర్ నెలాఖరు నాటికి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో 32 శాతం వాటా ఓలా ఎలక్ట్రిక్’దే. ఇప్పటి వరకు 30 వేల టూ వీలర్స్‌ను విక్రయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

