Ola Electric Diwali Offers | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. తన భారత్ ఫెస్ట్‌లో భాగంగా దీపావళి ఆఫర్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ఆఫర్ల ప్రకారం ఆయా ఈవీ స్కూటర్లపై గరిష్టంగా రూ.26,500 వరకూ రాయితీ పొందొచ్చు. బ్యాటరీపై ఉచిత వారంటీ పొడిగింపు, ఎక్స్చేంజ్ బోనస్, వారంటీపై భారీ తగ్గింపు, లాభదాయక ఫైనాన్సియల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయి.
ఎస్1 ప్రో జెన్-2 స్కూటర్ (S1 Pro Gen-2) కొనుగోలు దారులు బ్యాటరీపై రూ.7,000 విలువైన ఉచిత బ్యాటరీ వారంటీ పొందొచ్చు. ఎస్1 ఎయిర్ (S1 Air), ఎస్1 ఎక్స్+ (S1 X+) స్కూటర్లపై బ్యాటరీ వారంటీపై సమగ్ర వారంటీ పొడిగింపుపై 50 శాతం తగ్గింపు పొందొచ్చు. ఎస్1 ప్రో జెన్ 2 (S1 Pro Gen-2) స్కూటర్ కొనుగోలు చేసేవారు కేవలం రూ.2,000 చెల్లించి, (రూ.9,000) విలువ గల సమగ్ర వారంటీ పొడిగించుకోవచ్చు. కస్టమర్లు తమ పాత ఐసీఈ టూ వీలర్ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఎస్1 ప్రో జెన్ 2 (S1 Pro Gen-2) కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.10,000, ఎస్1 ఎయిర్ (S1 Air), ఎస్1 ఎక్స్+ (S1 X+) స్కూటర్లు కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. కొనుగోలుదారులు తమ సమీప ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్దకెళ్లి కూడా ఈ ఆఫర్ పొందవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు దారులు సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేస్తే రూ.7,500 వరకూ ధర తగ్గింపు ఉంటుంది. ఫైనాన్స్ ఆఫర్లో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 5.99 శాతం వడ్డీ, ఇతర ఆఫర్లు లభిస్తాయి. ఈ ఆఫర్లు కూడా దీపావళి వరకు మాత్రమే వర్తిస్తాయి. ఇక కస్టమర్లు ఏ ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్‌కైనా వెళ్లి ఓలా టెస్ట్ రైడ్ చేయొచ్చు. ప్రతి రోజూ ఎస్1ఎక్స్+ స్కూటర్ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. ఫ్రీ ఓలా మర్చండైజ్, ఓలా కేర్ + డిస్కౌంట్ కూపన్లు, ఎస్1 ప్రో జెన్2 స్కూటర్ కొనుగోలు దారులు రూ.1000 విలువ గల డిస్కౌంట్ కూప్ అందుకోవచ్చు.
ఎస్1 ప్రో జెన్ 2 (S1 Pro Gen-2) స్కూటర్ రూ.1,47,499, ఎస్1 ఎయిర్ (S1 Air) రూ.1,19,999, ఎస్1 ఎక్స్+ (S1 X+) రూ.1,09,999 ధరకే అందుబాటులో ఉన్నాయి. ఐసీఈ కిల్లర్ ప్రొడక్ట్ ఎస్1 ఎక్స్ (S1X) మూడు వేరియంట్లు.. ఎస్1 ఎక్స్+ (S1 X+), ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్స్ (S1 X (2kWh), ఎస్1 ఎక్స్ 3 కిలోవాట్స్ (S1 X (3kWh)ల్లో లభిస్తుంది. ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్స్ ((S1 X (2kWh), ఎస్1 ఎక్స్2 3 కిలోవాట్స్ ((S1 X (3kWh) స్కూటర్ల కొనుగోలు కోసం రూ.999లకే ప్రీ-రిజర్వేషన్ విండో అందుబాటులో ఉంది. ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్స్ ((S1 X (2kWh) స్కూటర్ రూ.89,999, ఎస్1 ఎక్స్3 కిలోవాట్స్ ((S1 X (3kWh) స్కూటర్ రూ.99,999లకు లభిస్తుంది.