Petrol Price | ఒపెక్ దేశాల కృత్రిమ కొరత వల్లే.. చమురు ధరలపై కేంద్రం
Petrol Price | ఒపెక్ దేశాల కృత్రిమ కొరత వల్లే దేశీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీ అన్నారు.

Petrol Price | ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ చెప్పారు. దీనివల్లే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయని సోమవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సహేతుకంగా ఉండాలని, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ధరల్ని నిర్ణయించాలని భారత్ తెలిపింది.
డిమాండ్‌కు అనుగుణంగా ముడి చమురు ఉత్పత్తి చేయకపోవడంపై ఒపెక్ దేశాల కూటమికి భారత్ పలుసార్లు నిరసన వ్యక్తం చేసిందని రామేశ్వర్ తేలీ చెప్పారు. ప్రపంచంలోనే చమురు దిగుమతి, వినియోగంలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఉన్నది. దేశీయంగా పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా ఆభారం ప్రజలపై మోపుతున్నట్లు కేంద్రం వాదిస్తున్నది. కానీ ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తడంతో ఎక్సైజ్ సుంకం తగ్గించింది. వ్యూహాత్మక చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని అమెరికా, భారత్, చైనా, జపాన్ నిర్ణయించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- opec+
- petrol prices
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

