న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఉత్పత్తి పెరగడంతోపాటు చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో జూన్ త్రైమాసికపు లాభంలో 4 శాతం వృద్ధి నమోదైంది. ఏడాది క్రితం రూ.1,555.49 కోట్లుగా నమోదైన లాభం గత త్రైమాసికానికిగాను రూ.1,613.34 కోట్లకు చేరుకున్నది. ప్రతి బ్యారెల్ క్రూడాయిల్‌ను శుద్ది చేయడంతో సంస్థకు 76.85 డాలర్ల ఆదాయం సమకూరింది. కంపెనీ టర్నోవర్ రూ.5,964 కోట్ల నుంచి రూ.4,644.73 కోట్లకు పడిపోయింది.