న్యూఢిల్లీ, డిసెంబర్ 5: నైకా ఫ్యాషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నిహిర్ పరిఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెంటనే అమలులోకి రానున్నదని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
వ్యక్తిగత అవసరాల నిమిత్తం రాజీనామా చేసిన ఆయనను వెంటనే రిలివరీ చేసినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. కంపెనీ ఆదాయంలో ఈ ఫ్యాషన్ వర్టికల్ 10 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.