న్యూఢిల్లీ, జనవరి 25: విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.5,169.69 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతిక్రతం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.5,208.87 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. పన్నులకు అధికంగా నిధులు వెచ్చించడంవల్లనే లాభాలపై ప్రభావం చూపాయని పేర్కొంది. కంపెనీ ఆదాయం ఈసారి రూ.45,597.95 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.
ఐసీఐసీఐ ఆకర్షణీయం
న్యూఢిల్లీ, జనవరి 25: ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.11,792 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.10,272 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధిని కనబరిచింది. బ్యాంక్ ఆదాయం కూడా రూ.42,792 కోట్ల నుంచి రూ.48,368 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.3 శాతం నుంచి 1.96 శాతానికి తగ్గగా, అలాగే నికర ఎన్పీఏలు కూడా 0.44 శాతం నుంచి 0.42 శాతానికి దిగొచ్చాయి.