న్యూఢిల్లీ, జనవరి 30 : విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.5,597.05 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.5,169.69 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.45,697.95 కోట్ల నుంచి రూ.46,304.77 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.2.75 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.