NSE Co location Scam | ఎన్ఎస్ఈ కొ-లొకేషన్ స్కాం.. పలు నగరాల్లో సీబీఐ సోదాలు.
NSE Co location Scam | ఎన్ఎస్ఈ కో లొకేషన్ స్కామ్ కేసులో బ్రోకర్లు లక్ష్యంగా సీబీఐ శనివారం 12 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ స్కాం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు తీవ్రతరం చేసింది. శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు చేపట్టింది. ముంబై, ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్, కోల్కతా తదితర నగరాల్లోని 12 చోట్లు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న స్టాక్ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలపై తనిఖీలు జరిగినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్ఎస్ఈ మాజీ సీఈవో-ఎండీ చిత్రా రామకృష్ణ, మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణ్యన్లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
2010-15 మధ్య జరిగిన పరిణామాల నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఎస్ఈలో ఓపీజీ సెక్యూరిటీస్ వ్యవహారాల నిర్వాహకురాలిగా చిత్ర రామకృష్ణ ఉన్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో 670 ట్రేడింగ్ రోజుల్లో సెకండరీ పీవోపీ సర్వర్ చిత్రా రామకృష్ణ పర్యవేక్షణలో ఉంది. ఆ టైంలో ఎన్ఎస్ఈ సర్వర్లపై కొంత మంది బ్రోకర్లకు యాక్సెస్ తెలుసుకునేందుకు ఆస్కారం ఇచ్చారన్న కోణంలోనూ దర్యాప్తు సాగనున్నది. ఎన్ఎస్ఈలో గుర్తు తెలియని అధికారులతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

