NSE Mobile APP | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) అధికారిక మొబైల్ యాప్ ఎన్ఎస్ఈఇండియా ( NSEIndia) ప్రారంభించింది. అలాగే, వెబ్‌సైట్‌ను సైతం విస్తరిస్తున్నట్లు పేర్కొంది. దీపావళి సందర్భంగా పదకొండు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఇన్వెస్టర్లు భారతీయ భాషనల్లో ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయొచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ల కోసం సమగ్ర ఆర్థిక పర్యావరణ వ్యవస్థను రూపొందించాలనే ఎన్ఎస్ఈ అంకితభావాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. దాంతో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారతదేశ క్యాపిటల్ మార్కెట్లతో అనుసంధానమవడాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది.
ఇప్పటికే ఎన్ఎస్ఈ వెబ్సైట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంగిష్, హిందీ, మరాఠీ, గుజరాతీతో పాటు అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు సహా మొత్తం 12 భాషల్లో కంటెంట్‌ను అందించనున్నది. NSEIndia మొబైల్ యాప్.. ప్రస్తుతం Apple App Store, Android Play Store రెండింటిలోనూ అందుబాటులో ఉన్నది. ఈ యాప్‌లోని కీలక ఫీచర్స్‌ని పరిశీలిస్తే.. మార్కెట్ సంబంధించిన అన్ని వివరాలు సమగ్రంగా అందించనుంది. యాప్‌లో ఇండికేషన్స్, మార్కెట్ స్నాప్షాట్లు, మార్కెట్ ట్రెండ్స్, టర్నోవతో పాటు నిఫ్టీలో టాప్ గెయినర్స్.. లూజర్స్ తదితర సమాచారం అందుబాటులో ఉంటుంది.