చిత్రా రామకృష్ణపై మనీలాండరింగ్ కేసు
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన్ కేసులో మార్చి నెలలో సీబీఐ అరెస్ట్ చేసిన చిత్రాను తాజాగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసుపై విచారించేందుకు నాలుగు రోజుల
అరెస్ట్ చేసిన ఈడీ
నిందితుల జాబితాలో మాజీ ముంబై
పోలీస్ కమీషనర్ సంజయ్ పాండే
న్యూఢిల్లీ, జూలై 14: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన్ కేసులో మార్చి నెలలో సీబీఐ అరెస్ట్ చేసిన చిత్రాను తాజాగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసుపై విచారించేందుకు నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. అలాగే ముంబై మాజీ పోలీస్ కమీషనర్ సంజయ్ పాండేపై కూడా ఈడీ కేసు పెట్టింది. చిత్రాతో పాటు ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్, సంజయ్ పాండేలపై వారం రోజుల క్రితమే సీబీఐ ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేయగా, ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ కేసు రిజిష్టర్ చేసింది. వివరాలివి…
- ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ కాల్స్‌ను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేసేందుకు మాజీ ఐపీఎస్ అధికారి పాండే స్థాపించిన ఐసెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నారాయణ్, చిత్రాలతో పాటు ఎక్సేంజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవి వారణాసి, హెడ్ (ప్రిమిసెస్) మహేష్ హల్దీపూర్లు నియమించినట్టు సీబీఐ, ఈడీలు వాటి ఫిర్యాదుల్లో పేర్కొన్నాయి.
- ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన సొమ్మును విదేశాలకు తరలించారా అన్న అంశమై ఈడీ దర్యాప్తు జరుపుతుంది.
- ఈ ఏడాది జూన్30తో పదవీ విరమణ చేసిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పాండే నాలుగు నెలలపాటు ముంబై పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించకముందు మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

