Nothing Phone 2a | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) ఫోన్‌ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ఎస్వోసీ చిప్సెట్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు అమోలెడ్ డిస్ప్లే, డ్యుయల్ 50-మెగా పిక్సెల్ కెమెరాలతో వస్తున్నది. నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.23,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ రూ.27,999లకు లభిస్తాయి. వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 12 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయాలు ప్రారంభం అవుతాయి. స్పెషల్ లాంచింగ్ ఆఫర్‌గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ మీద మార్చి 12న బుక్ చేసుకున్న రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.5 వర్షన్‌పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు ఆండ్రాయిడ్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 30-120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ఎస్వోసీ చిప్ సెట్ ఉంటాయి. రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్లతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మద్దతు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోపాటు 50 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెకండరీ 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2ఏ ఫోన్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై6, వై-ఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, క్యూజడ్ఎస్ఎస్, 360 డిగ్రీ యాంటెనా, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, యాక్సెలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరో స్కోప్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి. హై డెఫినేషన్ మైక్రో ఫోన్స్, డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. సింగిల్ చార్జింగ్ రెండు రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ ఉంటది. 23 నిమిషాల్లో 50 శాతం, 59 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది.